ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి సర్జరీ చేసిన డాక్టర్
Bengaluru Doctor: కర్నాటక రాజధాని బెంగుళూరులో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య. జామైందంటే గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిందే. ఇక టైం ఫిక్స్ చేసుకుని పనికి వెళ్లేవాళ్ల కోసం కష్టాలు తప్పవు. అయితే ఇటీవల
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య. జామైందంటే గంటలకొద్దీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిందే. ఇక టైం ఫిక్స్ చేసుకుని పనికి వెళ్లేవాళ్ల కోసం కష్టాలు తప్పవు. అయితే ఇటీవల ఓ బెంగుళూరు డాక్టర్ తన కారును ట్రాఫిక్‌లో వదిలేసి హాస్పిటల్‌కు పరుగులు తీశాడు. ఆ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సర్జాపూర్‌లో ఉన్న మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా చేస్తున్న డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఓ మహిళకు గ్యాల్‌బాడర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన ఆ డాక్టర్ ఫుల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. సర్జరీకి లేట్ అవుతుందేమో అన్న కంగారులో.. ఆ డాక్టర్ మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు. డ్రైవర్‌కే కారును వదిలేసిన ఆ డాక్టర్.. శరవేగంగా హాస్పిటల్‌కు చేరుకుని సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేశారు. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నారని, షెడ్యూల్ ప్రకారమే డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

