విమానాన్ని దారి మళ్లించి జర్నలిస్టు అరెస్టు

మిన్స్క్: అంతా హాలివుడ్ సినిమా తరహాలో జరిగింది. గ్రీసు రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్‌కు 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణికులతో వెళుతున్న ‘ర్యాన్ ఎయిర్’ విమానం బెలారూస్ మీదుగా వెళుతున్నది. మరికొద్ది సేపట్లో గమ్యం చేరుకుంటామని ప్రయాణికులు అనుకుంటున్నారు. కానీ ఇంతలో బెలారూస్ అధికారులు విమానంలోని సిబ్బందిని కాంటాక్ట్ చేశారు. అందులో బాంబు ఉన్నట్టు చెప్పారు. వెంటనే బెలారూస్ లో దిగాలని ఆదేశించారు. ఎస్కార్టుగా ఓ యుద్ధ విమానాన్ని కూడా పంపారు. పాపం పైలట్ ఏం చేస్తారు?
విమానాన్ని బెలారూస్ రాజధాని మిన్స్క్ లో దింపారు. అప్పుడు బెలారూస్ అధికారులు బాంబు తనిఖీ నెపం మీద విమానంలోకి ఎక్కి రోమన్ ప్రొటాసెవిచ్ అనే వ్యక్తిని తమ వెంట తీసుకుపోయారు. ఆయన ఎవరో కాదు బెలారూస్ సీనియర్ జర్నలిస్ట్. బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో విధానాలను తూర్పారబట్టడంలో దిట్ట. ఆ కారణంగా ఆయనపై అనేక కేసులు నమోదయ్యయి. ఇన్‌స్టాగ్రాంలో అధ్యక్షునికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నందుకు టెర్రరిజంతో సహా అనేక కేసులు పెట్టారు. దాంతో ప్రొటాసెవిచ్ విదేశాల్లో తలదాచుకుంటున్నారు. విమానంలో బెలారూస్ అధికారులు తనను తీసుకువెళుతున్నప్పుడు ప్రొటాసెవిచ్ తనకు మరణ శిక్ష విధిస్తారని బాధపడ్డాడట. బెలారూస్ జరిపిన ఈ దుస్సాహస చర్యపై ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. దారిదోపిడీ, కిడ్నాప్ వంటి ఆరోపణలతో బెలారూస్పై తీవ్రమైన ప్రకటనలు విడుదల చేశాయి. ఈ వ్యవహారం ఆంక్షల దాకా పోతుందని భావిస్తున్నారు. తన నిర్దేశిత మార్గంలో తాను పోతున్న విమానాన్ని ఇలా దారిమళ్లించడం అరుదైన ఘటనే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- arrest
- Belarus
- Greece
- journalist
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

