అందంగా లేనా?
నేను బాగా చదువుకున్నాను. తెలివైనదాన్ని. ప్రతి క్లాస్లో ఫస్టే. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. లక్షలమందితో పోటీపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పటి వరకూ అందచందాల గురించి ఆలోచించలేదు.
నేను బాగా చదువుకున్నాను. తెలివైనదాన్ని. ప్రతి క్లాస్లో ఫస్టే. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. లక్షలమందితో పోటీపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పటి వరకూ అందచందాల గురించి ఆలోచించలేదు. మొహానికి పౌడర్ రాసుకోవడం కూడా తెలియదు. సన్నగా ఉంటాను. సోడాబుడ్డి కళ్లద్దాలున్నాయి. నన్ను నేను మెరుగుపరుచుకోవడం సాధ్యమేనా? మిగతా అమ్మాయిల్లా ఆకర్షణీయంగా కనిపించగలనా? జీవితంలో దాంపత్య బంధమూ ముఖ్యమే. జీవిత భాగస్వామికి నచ్చకపోతే.. నా బతుకు వ్యర్థం అయినట్టే కదా? అందుకే ఈ ఆరాటం.
- పాఠకురాలు
మీరు ఉన్నత విద్యావంతులు. మీకంటూ ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నారు. కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. చాలామంది మహిళల్లో ఈ స్ఫూర్తి కొరవడుతున్నది. కెరీర్ విషయంలో మీరు సాధించిన విజయానికి అభినందనలు. ఇక అందచందాల ప్రస్తావనకు వస్తే.. ఆకర్షణీయంగా కనిపించాలనే మీ ఆలోచన తప్పేం కాదు. పోషకాహార నిపుణులతో సంప్రదించి.. మీకంటూ ఓ డైట్ ప్లాన్ సిఫారసు చేయమని అడగండి. లేజర్ సర్జరీ ద్వారా నేత్ర సమస్య సరిచేసుకోవచ్చు. లావుపాటి కళ్లద్దాల్ని పక్కన పడేయవచ్చు. బ్యుటీషియన్ సలహాతో చర్మం నిగారింపు పెంచుకోండి. మీ ఎత్తుకు, బరువుకు తగిన దుస్తులను ఎంచుకోండి. పెదాలకు లిప్స్టిక్ వేసుకున్నంత మాత్రాన సరిపోదు. పెదాల మీద చిరునవ్వూ ముఖ్యమే. ఎవరి కామెంట్లకో స్పందించి.. మీ ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసుకోకండి. మీరు అందంగా ఉన్నారనే విషయాన్ని ముందుగా మీరు నమ్మాలి కదా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

