హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)కు విదేశీ కంపెనీ నుంచి మరో పెద్ద కాంట్రాక్ట్ లభించింది. స్పెయిన్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నుంచి 21 మిలియన్ల డాలర్ల(రూ.156 కోట్ల) విలువైన ఆర్డర్ లభించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బీడీఎల్ డైరెక్టర్(టెక్నికల్) ఎన్పీ దివాకర్, ఎయిర్‌బస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్నల్ డిడిర్ ఒప్పందంపై సంతకాలు చేశారు.