హైదరాబాద్ : నూతన సంవత్సరం 2022 జనవరి నెలలో బ్యాంకులకు చాలా రోజులు సెలవులు వచ్చాయి. దీంతో తొమ్మిది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవుల జాబితాలో కొత్త సంవత్సరం రోజు, మకర సంక్రాంతి, నాలుగు ఆదివారాలు, సెకండ్ సాటర్ డే , రిపబ్లిక్ డే, ఫోర్త్ సాటర్ డే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులు గెజిటెడ్ సెలవులు మాత్రమే పాటిస్తాయి.
జనవరి 2022 జనవరి 1నకొత్త సంవత్సరం రోజున శనివారం, జనవరి 2న ఆదివారం, జనవరి 8న రెండవ శనివారం, జనవరి 9న ఆదివారం జనవరి 14న గురువారం మకర సంక్రాంతి, జనవరి 16న ఆదివారం జనవరి 22న నాలుగో శనివారం, జనవరి 23న ఆదివారం, జనవరి 26న బుధవారం గణతంత్ర దినోత్సవం ఉన్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు జనవరి నెలలో తొమ్మిది రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సెలవురోజుల్లో కూడా ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.