Balakrishna | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు అరెస్టుపై సిని మావాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు.
17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని చెప్పారు. బాబు అరెస్టు విషయంలో కేంద్రం మాట్లాడకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తన అక్క పురందేశ్వరితో టచ్లో ఉన్నామని బాలకృష్ణ వెల్లడించారు.