Ayodhya Mosque Construction | అయోధ్యలో త్వరలో మసీదు నిర్మాణం.. బాబ్రీ పేరు తొలగింపు
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు స్థలం కేటాయించారు. ఈ స్థలంలో మసీదు నిర్మాణానికి ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్మెంట్ కమిటీ సిద్ధమైంది. పవిత్ర రంజాన్ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం ప్రారంభిస్తామని ఐఐసీఎఫ్ డెవలప్మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న హాజీ అర్ఫత్ షేక్ తెలిపారు. మూడు నుంచి నాలుగేళ్లలో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రీడిజైన్ కారణంగా మసీదు నిర్మాణం ఆలస్యమైందని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. అలాగే మసీదు ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌లో 500 పడకల ఆసుపత్రి ప్రణాళికను కూడా చేర్చినట్లు చెప్పారు.
కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుమారు మూడు వేల కోట్లకుపైగా నిధులు సేకరించారు. అయితే అయోధ్యలో మసీదు నిర్మాణానికి నిధుల కొరత నెలకొన్నది. నిధుల కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని, నిధుల సేకరణకు ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని ఐఐసీఎఫ్ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ తెలిపారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు చక్రవర్తి బాబర్ పేరుతో ఉన్న ‘బాబ్రీ మసీదు’ వివాదాస్పద నిర్మాణంగా మారడంతో కొత్తగా నిర్మించే మసీదుకు ఆ పేరును తొలగించనున్నారు. ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు’గా పేరుపెట్టనున్నారు.
మరోవైపు నిధుల సేకరణకు త్వరలో క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ప్రారంభిస్తామని బీజేపీ నాయకుడైన షేక్ తెలిపారు. ‘ప్రజల మధ్య ఉన్న శత్రుత్వం, ద్వేషాన్ని ప్రేమగా మార్చడమే మా ప్రయత్నం. సుప్రీంకోర్టు తీర్పును మేం అంగీకరించినా, అంగీకరించకపోయినా.. మన పిల్లలు, ప్రజలకు మంచి విషయాలు బోధిస్తే ఈ పోరాటాలన్నీ ఆగిపోతాయి’ అని అన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన అల్లర్లు, హింసాకాండలో సుమారు 2,000 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువగా మంది ముస్లింలున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- Babri
- construction
- mosque
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

