Virat Kohli – ICC Video | కోహ్లీపై ఆసీస్ క్రికెటర్ల అభిప్రాయం ఇది.. ఇన్‌స్టాలో వీడియో పెట్టిన ఐసీసీ
Virat Kohli - ICC Video : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అభిమాన గణం ఎక్కువన్న విషయం తెలిసిందే. అందుకనే ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం కోహ్లీని పొగడకుండా ఉండలేరు. అందకు నిదర్శనమే ఈ వీడియో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు కోహ్లీ గురించి ఏం అనుకుంటున్నారు? అనేది ఇందులో ఉంది. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాటలో...
Virat Kohli – ICC Video : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అభిమాన గణం ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆటపట్ల అంకితభావంతోనే కాకుండా తన ఫిట్నెస్తోనూ విరాట్ అందరి మనసు గెలుచుకున్నాడు. అందుకనే ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం కోహ్లీని పొగడకుండా ఉండలేరు. అందకు నిదర్శనమే ఈ వీడియో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు కోహ్లీ గురించి ఏం అనుకుంటున్నారు? అనేది ఇందులో ఉంది.
ఈ వీడియోను ఐసీసీ(ICC) అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాటలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీని అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘కోహ్లీ.. మ్యాన్ ఆఫ్ ఇండియా’ – అతను పదేళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు’ అని గ్రీన్ అన్నాడు. స్మిత్ అయితే.. ‘ఎప్పటినుంచో విరాట్ ఒక సూపర్ స్టార్. ఆస్ట్రేలియాపై ఆడడాన్ని బాగా ఇష్టపడతాడు. ప్రతిసారి మాపై పరుగులు సాధిస్తాడు. అయితే.. ఈవారం మేము అతడికి అవకాశం ఇవ్వదలచుకోలేదు’ అని తెలిపాడు.
‘కోహ్లీ.. ఒక పోరాట యోధుడు – అతడి కవర్ డ్రైవ్ నమ్మశక్యం కాదు’ అని డేవిడ్ వార్నర్ వర్ణించాడు. ‘కోహ్లీ దిగ్గజాల్లో ఒకడు. అన్ని ఫార్మాట్లలో అతను గొప్ప ప్లేయర్. అయితే.. ఈ వారం అతను చెలరేగొద్దని అనకుంటున్నా’ అని మార్నస్ లబూషేన్ చెప్పుకొచ్చాడు.’ చాలా నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఏళ్లుగా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మిడిలార్డర్‌కు అతడు వెన్నెముక’ అని పేసర్ మిచెల్ స్కార్ట్ వర్ణించాడు. ‘మంచి ప్లేయర్. కానీ, తరచూ తగాదాకు చూస్తుంటాడు’ అని ప్యాట్ కమిన్స్ అన్నాడు.
ఇవి కూడా చదవండి
Josh Hazlewood | ఆసీస్‌కు పెద్ద షాక్.. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టార్ పేసర్ దూరం
SL vs AFG | ఈ ఏడాది వన్డేల్లో శ్రీలంక తొలి విజయం.. అఫ్గనిస్థాన్‌తో సిరీస్ సమం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

