6 లక్షల డాలర్లు, బంగారం లంచంగా తీసుకున్న ఆంగ్ సాన్ సూకీ..

యంగాన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైన్యం అవినీతి ఆరోపణలు చేసింది. యాంగాన్ మాజీ సీఎం పయో మెన్ థేన్ నుంచి సూకీ భారీ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మాజీ సీఎం నుంచి సుమారు ఆరు లక్షల డాలర్లతో పాటు బంగారం కూడా సూకీ తీసుకున్నట్లు సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్జా మిన్ తున్ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మయన్మార్‌లో ఉన్న ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి మయన్మార్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం కూడా మయన్మార్‌లో భారీ స్థాయిలో ర్యాలీలు జరిగాయి. సూకీపై వస్తున్న లంచం ఆరోపణలను ఆమె తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సూకీతో పాటు పలువురు నేతలు, అధికారులు ప్రస్తుం ఆర్మీ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల ఆధారంగా ప్రభుత్వాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూకీకి భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అక్రమరీతిలో ఆరు వాకీటాకీ రేడియోలను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కరోనా ఆంక్షలను కూడా ఆమె ఉల్లంఘించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

