ఆఫ్ఘన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన అసిఫ్ అలీ.. వీడియో
దుబాయ్: ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పాక్ బ్యాటర్ ఆ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 130 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓ దశలో దాదాపు ఓటమికి చేరువైంది. అయితే 19వ ఓవర్లో పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ.. ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. ఆ ఓవర్లో అయిదో బంతికి సిక్సర్ కొట్టిన అలీని.. ఆరవ బంతికి ఫరీద్ ఔట్ చేశాడు. అలీని ఔట్ చేసిన తర్వాత అతని మీదుకు వెళ్లాడు ఫరీద్. కానీ ఫరీద్ ప్రవర్తన నచ్చని అలీ.. తన బ్యాట్‌తో అతనిపై దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వెంటనే ఆఫ్ఘన్ ప్లేయర్లు జోక్యం చేసుకుని ఇద్దరు ప్లేయర్లను వేరు చేశారు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి రెండు బంతుల్లో నసీమ్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఆఫ్ఘన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆఫ్ఘన్ బౌలర్‌పై అసిఫ్ అలీ బ్యాట్ ఎత్తిన వీడియో ఇదే.
Heated moments in today's match!!
😳😳#PAKvAFG #NaseemShah #asifali #afganistán pic.twitter.com/XQFdVA7XIl— K (@kavyaguptaaa) September 7, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

