లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి
లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి | అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో బుధవారం ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ

ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో బుధవారం ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో 11 మంది ఉండగా.. మిగింగో ట్రాన్సిట్ క్యాంప్ నుంచి ట్యూటింగ్ క్యాంప్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తుండగా పాంగో – ట్యూటింగ్ మధ్య లోయలో పడిపోయిందని ట్యూటింగ్ అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీ) స్టార్లీ జామోహ్ తెలిపారు.
ప్రమాదంలో నాల్గో సిక్కు లైట్ పదాతిదళ రిజిమెంట్‌కు చెందిన జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని వెంటనే ఆర్మీ ఛాపర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నలుగురిలో ఒకరిని అసోంలోని టిన్సుకియా జిల్లాలోని దింజన్ ఆర్మీ బేస్ ఆసుపత్రిలో చేర్పించగా.. మిగతా ముగ్గురిని గువాహటి ఆర్మీ బేస్ దవాఖానకు తరలించినట్లు చెప్పారు. ఆరుగురు జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయని, రోడ్డు మార్గంలో వారిని ట్యూటింగ్కు పంపినట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

