Heath tips | నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తున్నదా.. ఈ చిట్కాలతో చక్కగా నిద్రపోండి..
Heath tips : కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి సరిగా నిద్రపట్టదు. దాంతో శారీరకంగా నీరసించిపోతారు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..?

మంచి నిద్రకు చిట్కాలు..
అశ్వగంధ చూర్ణం
అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దానివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ సహజంగా ట్రై ఎథిలిన్ గ్లైకాల్ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకోవడానికి 30 నిమిషాలు ముందు అశ్వగంధను తీసుకోవచ్చు.
బాదాం జ్యూస్
బాదాంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదాంలో మెగ్నీషియం ఉంటుంది. నిద్ర సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలింపజేస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
జాజికాయ పాలు
ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తీసుకోవడంవల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండూ మంచి నిద్రకు తోడ్పడుతాయి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. వీటిలో ట్రిప్టోఫాన్తోపాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరటోనిన్ను నిర్మించడంలో సహాయపడతాయి. సెరటోనిన్ నిద్రను మెరుగుపరుస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!