Health tips | నోటి దుర్వాసనతో నలుగురిలో ఇబ్బందిగా ఉందా.. అయితే రోజూ ఉదయాన్నే ఈ పని చేయండి..!
Health tips | మీరు ఎంత శుభ్రత పాటించినా, రోజూ ఉదయాన్నే శుభ్రంగా బ్రష్ చేసుకుంటున్నా నోటి నుంచి దుర్వాసన వస్తున్నదా..? ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలా మందిని ఈ సమస్య వేధిస్తున్నది. మన నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మనకు దూరంగా ఉండి మట్లాడుతారు.
Health tips : మీరు ఎంత శుభ్రత పాటించినా, రోజూ ఉదయాన్నే శుభ్రంగా బ్రష్ చేసుకుంటున్నా నోటి నుంచి దుర్వాసన వస్తున్నదా..? ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలా మందిని ఈ సమస్య వేధిస్తున్నది. మన నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మనకు దూరంగా ఉండి మట్లాడుతారు. ఇది మనకు అవమానంగా, సిగ్గుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సమస్య ఉండకూడదంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. దాంతో నోటి దుర్వాసన సమస్య నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు.
పుష్కలంగా నీళ్లు తాగాలి
నోటి దుర్వాసన సమస్య వేధిస్తున్నట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం రోజూ పుష్కలంగా నీళ్లు త్రాగాలి. నీళ్లు ఎక్కువగా తాగి మూత్ర విసర్జన చేస్తుండటం ద్వారా కడుపులోని మలినాలు తొలగిపోతాయి. దాంతో నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
లవంగం నమలాలి
ఉదయం బ్రష్ చేయగానే ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేయడంవల్ల కూడా నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
కొబ్బరి నూనె వాడాలి
నోటి దుర్వాసనను పోగొట్టడంలో కొబ్బరి నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే నోట్లో కొద్దిగా కొబ్బరి నూనె పోసుకుని, కాసేపు పుక్కిలిపట్టి ఆ తర్వాత నోరు కడిగేసుకోండి. ఇలా చేయడంవల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది.
మస్టర్డ్ ఆయిల్తో మర్దన
ఆవనూనెలో ఉప్పు కలిపి వేళ్లతో చిగుళ్లను బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేగాక మీ దంతాలు కూడా మిలమిలా మెరుస్తాయి.
పుదీనా ఆకులు
అదేవిధంగా రోజులో ఎప్పుడైనా వీలు చేసుకుని పుదీనా ఆకులను నమలండి. పుదీనా నమలడం ద్వారా కూడా నోట్లో నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. పైగా ఇది నోటిని చల్లగా కూడా ఉంచుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

