Harmful Soft drinks | ఎండపూట చల్లగా ఉంటుందని కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ డేంజర్ గురించి తెలుసుకోండి..!
Harmful Soft drinks : చాలామంది ఎండలకు తాళలేక కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. హమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందంటూ ఉపశమనం పొందుతారు. కానీ కృత్రిమంగా తయారు చేసిన శీతల పానీయాలు ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పించడానికి కొన్ని క్షణాలు మాత్రమే సాయపడుతాయి.
Harmful Soft drinks : చాలామంది ఎండలకు తాళలేక కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. హమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందంటూ ఉపశమనం పొందుతారు. కానీ కృత్రిమంగా తయారు చేసిన శీతల పానీయాలు ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పించడానికి కొన్ని క్షణాలు మాత్రమే సాయపడుతాయి. తీయగా, చల్లగా ఉండే పానీయం గొంతులోకి దిగగానే వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అందుకే ఎండ ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది శీతల పానీయాలను కోరుకుంటారు.
అయితే ఇలా ఎండ నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదని, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుండె దడ ఉన్న వారు ఎండ నుంచి ఉపశమనం కోసం ఇలా చల్లటి పానీయం తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనకారులు తెలిపారు. భారత దేశానికి చెందిన కార్డియాలజిస్టులు కూడా ఈ అధ్యయన ఫలితాలతో ఏకీభవిస్తున్నారు. జనం చల్లటి, తీపి పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యూకే బయోబ్యాంక్‌లోని 2,00,000 మంది పార్టిసిపెంట్స్‌పై పరిశోధన చేసి వెల్లడించిన ఆరోగ్య డేటా మనకు ఒక మేల్కొలుపు అనే చెప్పాలి. ఎందుకంటే వారానికి రెండు లీటర్ల కంటే ఎక్కువ శీతల పానీయం తీసుకునే వారి హార్ట్ బీట్ లయ తప్పినట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
అధ్యయన ఫలితాలు
అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ‘సర్క్యులేషన్: అరిథ్మియా అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ (Circulation: Arrhythmia and Electrophysiology)’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎంతో ముఖ్యమైన ఫలితాలను వెల్లడించింది. కృత్రిమంగా తయారుచేసిన శీతల పానీయాలను వినియోగానికి, గుండె దడ పెరగడానికి మధ్య సంబంధం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.
యూకే బయోబ్యాంక్‌లోని 2,00,000 మందికిపైగా పార్టిసిపెంట్స్‌ను పరిశోధకులు తమ అధ్యయనానికి ఎంచుకున్నారు. అధ్యయనానికి ముందు వారిలో ఎవరికీ గుండె దడ లేదు. ఒక దశాబ్దంపాటు పార్టిసిపెంట్స్ డైట్ సమాచారాన్ని, జన్యుసంబంధ డాటాను జాగ్రత్తగా పరిశీలించారు. వారిలో 9,362 గుండె దడ కేసులు నమోదయ్యాయి. అసలు కూల్ డ్రింక్సే తాగని వాళ్లతో పోలిస్తే వారానికి రెండు లీటర్ల కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ తీసుకునే వారిలో గుండె దడ రిస్క్ 20 శాతం ఎక్కువగా ఉంది. అయితే వారానికి అంతే మోతాదులో ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా సహజంగా చక్కెర కలుపుకుని చేసుకున్న కూల్ డ్రింక్స్ తాగిన వారిలో గుండె దడ రిస్క్ కేవలం 10 శాతం ఎక్కువగా నమోదైంది.
అయితే ఇందుకు విరుద్ధంగా వారానికి ఒక లీటరు లేదా అంతకంటే తక్కువగా పండ్ల రసాన్ని తీసుకునే వారిలో గుండె దడ రిస్క్ 8 శాతం తగ్గినట్లుగా పరిశోధనలో తేలింది. దీన్ని బట్టి కృత్రిమంగా తయారయ్యే శీతల పానీయాల కంటే సహజ పానీయాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని అర్థమవుతుంది.
ఈ అధ్యయన ప్రధాన రచయిత నింగ్జియాన్ వాంగ్ పానీయాల ఎంపికలో జాగ్రత్త వహించడం ఎంత అవసరమో నొక్కిచెప్పారు. కృత్రిమ, చక్కెరతో చేసిన తీపి పానీయాలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కృత్రిమ కూల్ డ్రింక్స్ తీసుకుంటే గుండె దడ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
ఈ అధ్యయనం భారత్‌కు కీలకం: నిపుణులు
ఈ అధ్యయనం ప్రాముఖ్యత గురించి ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించారు. ఇది భారత జనాభాకు కూడా మంచిదని భారతదేశ వైద్యులు అంగీకరించారు. పెరుగుతున్న హృదయ సంబంధ వ్యాధుల భారంతో భారత్ పోరాడుతోందని, ఈ రుగ్మతలు మరణాలకు ప్రధాన కారణమని చెప్పారు. గుండె దడ లాంటి పరిస్థితులకు దారితీసే కారకాల గురించి తెలుసుకోవడం వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కృత్రిమ స్వీటెనర్స్ ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పటివరకు స్పష్టత లేదని, ఇప్పుడు ఈ అధ్యయనం గుండె దడ పెరిగి గుండె పోటుకు దారితీసే ప్రమాదం ఉందనే విషయాన్ని నిరూపించిందని తెలంగాణకు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మడివాడ అన్నారు.
చక్కర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటికే తేలిందని, కృత్రిమ స్వీటెనర్లు చక్కెర కంటే ప్రమాదమని ఈ అధ్యయనంలో తేలిందని ముఖర్జీ చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అభయ్ మాట్లాడుతూ.. భారతీయులు కొన్ని గుండె జబ్బులు, మధుమేహం లాంటి జీవక్రియ రుగ్మతలకు జన్యు సిద్ధత కలిగి ఉండవచ్చునని, కాబట్టి ఆహార కారకాలు ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై పరిశోధనలు ఉపయుక్తమని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

