Gold purity | మీరు బంగారం కొంటున్నారా.. మోసపోకూడదంటే ఇవి తెలుసుకోండి..!
Gold purity : దేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. బంగారం అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లిళ్లు, మరే ఇతర శుభకార్యాలైనా బంగారం లేకుండా జరిగే పరిస్థితే లేదు. బ్యాంకులు, నగల దుకాణాలు, ఆథరైజ్డ్ డీలర్ల నుంచి బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్లను కొనుగోలు చేస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోవాల్సి వస్తుంది. మనం కొనుగోలు చేస్తున్న బంగారం నకిలీదా.. లో క్వాలిటీదా.. లేదంటే స్వచ్ఛమైనదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Gold purity : దేశంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. బంగారం అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లిళ్లు, మరే ఇతర శుభకార్యాలైనా బంగారం లేకుండా జరిగే పరిస్థితే లేదు. బ్యాంకులు, నగల దుకాణాలు, ఆథరైజ్డ్ డీలర్ల నుంచి బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్లను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ, దంతేరాస్ లాంటి పర్వదినాల్లో బంగారాన్ని ఇంకా ఎక్కువగా కొంటుంటారు. ఆ రెండు రోజుల్లో బంగారం కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు.
అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోవాల్సి వస్తుంది. మనం కొనుగోలు చేస్తున్న బంగారం నకిలీదా.. లో క్వాలిటీదా.. లేదంటే స్వచ్ఛమైనదా..? అని తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యారెట్స్
సాధారణంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. దీనిని kt లేదా k తో సూచిస్తారు. 24-క్యారెట్ బంగారం అత్యంత స్వచ్ఛమైనది. దీంట్లో 99.9 శాతం బంగారం ఉంటుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి నగల తయారీ కోసం దీనికి ఇతర లోహాలను కలుపుతారు. 18k బంగారంలో 18 భాగాలు బంగారం, 6 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. అంటే 18 క్యారెట్ బంగారంలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అదేవిధంగా 22 క్యారెట్ బంగారంలో 99.6 శాతం స్వచ్ఛత ఉంటుంది.
చిట్కాలు
హాల్‌మార్క్
స్వచ్ఛమైన బంగారానికి ISI హాల్‌మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేసిన ఈ చిహ్నం ప్రభుత్వ గుర్తు. ఇది అన్ని బంగారు నగలపై కనిపిస్తుంది. హాల్‌మార్క్ లేకపోతే ఆ బంగారం స్వచ్ఛమైనది కాదని తెలుసుకోవాలి.
వెనిగర్ టెస్ట్
బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వెనిగర్ టెస్ట్ ద్వారా గోల్డ్ ప్యూరిటీని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ పోయాలి. రంగు మారితే బంగారం స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోవాలి. రంగు మారకపోతే అది స్వచ్ఛమైన బంగారం.
యాసిడ్ టెస్ట్
ఈ పరీక్ష బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అత్యంత నమ్మకమైన పద్ధతులలో ఒకటి. ఈ టెస్ట్ చేయడానికి ముందుగా నైట్రిక్ యాసిడ్‌తోపాటు ఒక రాయిని తీసుకోవాలి. బంగారాన్ని రాయిపై రుద్దాలి. దానిపై నైట్రిక్ యాసిడ్ పోయాలి. బంగారం తప్ప మరేదైనా లోహం ఉంటే యాసిడ్ దానిని కరిగిస్తుంది.
తేలియాడే పరీక్ష
బంగారం నీటిపై తేలియాడదు. ఎందుకంటే దాని పరమాణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని సాంద్రతను పెంచుతాయి. అయితే ఏదైనా ఇతర లోహం కలిపితే బంగారం తేలియాడుతుంది.
అయస్కాంత పరీక్ష
బంగారాన్ని అయస్కాంతానికి దగ్గరగా ఉంచాలి. బంగారం అయస్కాంతానికి అతుక్కుంటే అది ప్యూర్ గోల్డ్ కాదని అర్థం. అందులో మెటల్స్ బాగా కలిశాయని లేదా అది లో క్వాలిటీ గోల్డ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం అయస్కాంతానికి అతుక్కోదు. మ్యాగ్నెట్ దగ్గర పెట్టినా పుత్తడి కొంచెం కూడా రియాక్ట్ కాదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

