AP News | తిరుమల క్షేత్రంలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. ఆలయ నిబంధనలు బేఖాతరు..!
AP News | కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
AP News : కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు జనసేన కార్యకర్తలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో రీల్స్ చిత్రీకరించారు.
ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వాడటం, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం అని తెలిసినప్పటికీ వారు ఈ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావులేదని టీటీడీ స్పష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది.
కొండపై రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, నినాదాలు, ప్రసంగాలు పూర్తిగా నిషేధం. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయరాదని ప్రముఖులకు సైతం టీటీడీ సూచిస్తుంటుంది. ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. అంతేగాక ఆలయ మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకం, ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై కఠినమైన నిషేధం అమలులో ఉంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టినా, కొందరు యాత్రికులు నిబంధనలను అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది. తాజాగా జరిగిన ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రాజకీయ అభిమానాన్ని ప్రదర్శించాల్సింది పవిత్ర పుణ్యక్షేత్రంలో కాదని, ఇలాంటి చర్యలవల్ల క్షేత్ర పవిత్రత మసకబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించిన ఈ వ్యక్తులపై టీటీడీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. టీటీడీ అబాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

