AP News | నియంతలా నారా లోకేశ్.. కార్మిక సంఘాలకు బెదిరింపులు : గుడివాడ అమర్నాథ్
AP News | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ ప్రమాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రస్తుతం ‘రెడ్‌బుక్’ అరాచకం నడుస్తోందని, లోకేశ్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
AP News : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ ప్రమాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రస్తుతం ‘రెడ్‌బుక్’ అరాచకం నడుస్తోందని, లోకేశ్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేజీహెచ్ వద్ద న్యాయం అడిగిన కార్మిక సంఘాలను లోకేశ్ తీవ్రంగా అవమానించారని, వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై అరకు వైసీపీ ఎంపీ తనూజ రాణి కూడా స్పందించారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం కేవలం భద్రతా వైఫల్యాల వల్లే జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు జరగాలన్నారు.
కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని, మృతుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారంతో పాటు ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తనూజ రాణి డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితుల పునరావాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

