AP News | ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
AP News | ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.
AP News : ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతోపాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఉద్యోగుల వయసు పెంపుతోపాటు పలు ఇతర కీలక ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనకు, తద్వారా 35 వేల ఉద్యోగాలను సృష్టించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అంతేగాక ఉండవల్లిలో మౌలిక వసతుల కల్పనకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్లు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 80కి పైగా అజెండా అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు హోంమంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

