పవన్‌కల్యాణ్‌కు సవాల్ విసిరిన కొడాలి నాని
AP minister Kodali Nani Chalenge to Pawankalyan | ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య మాటల యద్ధం కొనసాగుతోంది. నిన్న మంగళగిరి జనసేన అధినేత

అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య మాటల యద్ధం కొనసాగుతోంది. నిన్న మంగళగిరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ గురువారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు సవాల్ విసిరారు. జగన్‌ను ఓడించే సత్తా పవన్‌కు లేదన్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ ఓడిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ‘నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకో.. 2024లో నువ్వు ఏం చేస్తావో చూస్తా’ అన్నారు. ‘చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా.. మేం చూసుకుంటాం.. మమ్మల్ని పవన్ కల్యాణ్ భయపెట్టేందేంటి.. ఇంకో జాని సినిమా చూసి భయపెడుతారా?’ అంటూ సెటైర్లు వేశారు.
పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడుతారని, జగన్ సోనియాకే భయపడలేదన్నారు. చంద్రబాబు స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడుతారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలే గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో ధైర్యంగా ముందుకెళ్తాం.. కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. బద్వేల్లో గెలుస్తామని ధైర్యంగా చెప్పే ధైర్యం పవన్‌కు ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌పై ద్వేషంతో పవన్ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్, మనోహర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

