AP Dycm Pawan Kalyan | సింహాచలం దుర్ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను : పవన్ కళ్యాణ్
| విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
Pawan Kalyan | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం
సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర…
— JanaSena Party (@JanaSenaParty) April 30, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

