e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫ‌న్ టైం- వీడియో వైర‌ల్

కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫ‌న్ టైం- వీడియో వైర‌ల్

కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫ‌న్ టైం- వీడియో వైర‌ల్

నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన ముద్దుగుమ్మ అనిత‌.ఈ సినిమా తర్వాత ‘శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల్లో నటించింది. 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌తో ఏడడుగులు వేసిన అనిత ఫిబ్ర‌వరి 9న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కుమారుడికి ఆర‌వ్ అనే పేరుని పెట్టుకున్న ఈ దంప‌తులు ప్ర‌స్తుతం పండంటి బిడ్డ‌తో ఆనంద క్ష‌ణాలు గడుపుతున్నారు.

తాజాగా కుమారుడు ఆర‌వ్‌తో క‌లిసి స‌ర‌దాగా ఆడుకుంటున్న వీడియో ఒక‌టి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసి, ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం అనే కామెంట్ పెట్టింది. అనిత షేర్ చేసిన వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అనిత హంస నందినికి టాలీవుడ్ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిందీలో పలు టీవీ సీరియల్స్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సీరియ‌ల్ న‌టిగాను అనిత మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. త్వ‌ర‌లో ఆమె తిరిగి వెండితెర ఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫ‌న్ టైం- వీడియో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement