Canada Minister Anita : కెనడా భారతీయుల అనితానందం

భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కెనడా ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేబట్టిన రెండో మహిళ అనిత.
కెనడా క్యాబినెట్లో స్థానం సంపాదించిన తొలి హిందువు కూడా తనే. అనిత 2019లో పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్ మంత్రిగా సేవలందించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో టీకాల సేకరణలో అనిత చొరవను ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రశంసించారు. ఇప్పటివరకు, భారతీయ మూలాలున్న హర్జీత్ సజ్జన్ కెనడా రక్షణ మంత్రిగా ఉన్నారు. సాయుధ దళాల్లో లైంగిక దుష్ప్రవర్తన విషయమై సజ్జన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను తప్పించి, అనితకు పదోన్నతి కల్పించారు. అనిత తండ్రి తమిళుడు, తల్లి పంజాబీ. సెప్టెంబర్‌లో జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ అభ్యర్థిగా అనిత ఓక్విల్లే నుంచి విజయం సాధించారు. ‘సాయుధ దళాల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నామనుకునేలా చేయడమే నా తొలి ప్రాధాన్యం. అవసరమైనప్పుడు వారికి అండగా నిలుస్తాం. వారికి న్యాయం జరిగేందుకు సంబంధిత వ్యవస్థలు హామీ ఇవ్వాలి’ అని ఆమె పేర్కొన్నారు. అనిత భర్త పేరు జాన్. ఆ దంపతులకు నలుగురు పిల్లలు. అనిత వృత్తిరీత్యా కార్పొరేట్ న్యాయవాది. అనేక కీలక కేసుల్లో గెలిచి సమర్థురాలిగా పేరు తెచ్చుకొన్నారు. అనిత తల్లి సరోజ్ డి.రామ్, తండ్రి ఆనంద్. ఇద్దరూ వైద్యులే. ‘నా నియోజక వర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితం’ అంటారామె. ‘కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నా’ అంటూ ట్విటర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు అనిత.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anita
- Canada Minister
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

