ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు సీఎం జగన్ నివాళి
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు నివాళి | కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకటయ్య సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. బద్వేల్లోని వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

అమరావతి : కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకట సుబ్బయ్య (62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
వెంకటయ్య సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. బద్వేల్లోని వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపారు.
2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన వెంకట సుబ్బయ్య టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంటర్ చదువుతుండగా, కుమార్తె ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
డాక్టర్ వెంకట సుబ్బయ్య స్వస్థలం కడప జిల్లా బద్వేలు మండలంలోని మల్లెలవారిపల్లి. వెంకట సుబ్బయ్య మృతిపట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యే కడప జిల్లా వైసీపీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

