ఇదేమిటో చెప్పగలరా.. ఆనంద్ మహీంద్రా క్విజ్

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నూతన ఆవిష్కరణలు మెచ్చుకుంటూ సరదాగా, ప్రోత్సాహకరకంగా ఉండే ట్విట్టర్లో పోస్టులు పెడుతుంటారు. ఈసారి ఆయన ఓ మెదడుకు మేత లాంటి పోస్టు పెట్టారు. ఓ గుండ్రిని బంతి.. దానికి ఒకవైరు నాలుగు సన్నని రాడ్లవంటివి తగిలించి ఉన్నాయి. ఇదేమిటో ఈ తరంవారు ఎవరైనా చెప్పగలరా? అని ఓ ప్రశ్నను సంధించారు. ఇంకేముంది ఎవరికి తోచింది వారు పెట్టారు. కానీ కొందరు కరెక్టుగా గెస్ చేశారు. అది రష్యా ఉపయోగించిన మొట్టమొదటి స్పుత్నిక్ ఉపగ్రహం. అంతరిక్షంపై మానవ విజయానికి సంకేతం. స్పుత్నిక్-1 అని దానికి పేరు. ఆ ప్రయోగం విజయవంతమై స్పుత్నిక్-1 భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ సంకేతాలు పంపడం విశేషం. ఆ తర్వాత చాన్నాళ్లకు అమెరికా ఉపగ్ర ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు తాజాగా రష్యా కరోనా వ్యాధిపై పోరాటానికి రూపొందించటిన వ్యాక్సిన్ కు స్పుత్నిక్-5 అని పేరు పెట్టింది. ఈ స్పుత్నిక్ను, ఆ స్పుత్నిక్ను గుర్తు చేస్తూ మహీంద్ర పెట్టిన పోస్టుకు బోలెడు లైకులు, కామెంట్లు వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

