Amy Jackson | త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న అమీ జాక్సన్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్
Amy Jackson | బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ (Amy Jackson) పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ( Ed Westwick )తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ జరిగింది.
Amy Jackson | బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ (Amy Jackson) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ చిత్రంతోపాటు రోబో 2.O చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్ముడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ( Ed Westwick )తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ జరిగింది.
అమీ జాక్సన్ గతంలో జార్జ్ పనయోట్టు (George Panayatiou) అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమాయణం సాగించింది. అతడితో 2019లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అనంతరం పెళ్లి కాకుండానే తల్లైంది. అయితే వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది. 2022లో పనయోట్టుతో తన బంధం ముగిసినట్లు అమీజాక్సన్ ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటున్న అమీ జాక్సన్.. హాలీవుడ్ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఇప్పుడు అతడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
స్విట్జర్లాండ్‌లో అందమైన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అమీజాక్సన్‌కు రింగ్ తొడిగి వెస్ట్విక్ ప్రొపోజ్ చేశాడు. అమీజాక్సన్ సైతం వెస్ట్విక్ ప్రొపోజల్‌కు ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు అమీ జాక్సన్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు అమీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read..
Indian student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
Sachin Tendulkar | సచిన్ డీప్‌ఫేక్ వీడియో పెట్టింది ఫిలీప్పీన్స్ వాసి.. ముంబై పోలీసులు
Elon Musk | మనిషి మెదడులో ‘చిప్’.. విజయవంతమైందన్న ఎలన్ మస్క్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

