e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News ఓల్డ్ ఏజ్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామ‌ర్ షో అదర‌హో..!

ఓల్డ్ ఏజ్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామ‌ర్ షో అదర‌హో..!

ఈ మధ్య కుర్ర భామ‌లే కాదు సీనియ‌ర్ నటీమ‌ణులు కూడా అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ న‌టీమ‌ణి అమీషా ప‌టేల్ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సుల‌ని ఎంత‌గా చెద‌ర‌గొడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ర‌చు త‌న సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. నలబై దాటినా కుర్ర హీరోయిన్స్ కుళ్లుకునేలా పరువాల విందు అందిస్తుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 2000లో ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముంబై భామ అమీషా పటేల్. ఆతర్వాత ఈ భామ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో ‘నాని’, ఎన్టీఆర్‌తో నరసింహుడు, బాలకృష్ణతో పరమ వీర చక్ర సినిమాల్లో నటించింది. 20ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఈ భామ క్రేజ్ తగ్గలేద‌నే చెప్పాలి. బాలీవుడ్‌లోను వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్న అమీషా ప‌టేల్ సోష‌ల్ మీడియాలో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.

- Advertisement -

రీసెంట్‌గా ఢిల్లీ వెళ్లిన అమీషా ప‌టేల్ స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర షార్ట్ డ్రెస్ ధ‌రించి అందాల ఆర‌బోత చేస్తుంది. అమీషాని ఈ లుక్‌లో చూసిన నెటిజ‌న్స్‌కి మ‌తులు పోతున్నాయి. 45 ఏళ్ల వ‌య‌స్సులోను అమీషా ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్ ని అల‌రించ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement