నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనల మధ్య ఉత్సవాలను రాత్రి ప్రారంభించనున్నారు. నిత్యం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరించనున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశితో తెప్పోత్సవాలు మొదలై పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందు కోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు (షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం రోజుకు 500 కిలోల పుష్పాలను వినియోగించనున్నారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మల్లెపూల మాలలు అలంకరించనున్నారు. సంవత్సరంలో తెప్పోత్సవాల నుంచే మల్లెపూలను స్వామివారి సేవలకు వినియోగించడం మొదలవుతుంది.
ఉత్సవాల సందర్భంగా నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. తొలిరోజు సాయంత్రం సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల నేపథ్యంలో 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ (వర్చువల్)లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్నిగమనించాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

