పనిలేని వారి పసలేని మాటలవి..
బాలీవుడ్ అగ్ర నాయికలు అలియాభట్, కంగనారనౌత్ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై నిరసనగళం వినిపిస్తున్నది కంగనారనౌత్. ఈ క్రమంలో ఆమె ఇటీవలే అలియాభట్‌పై విమర్శలు చేసింది.
బాలీవుడ్ అగ్ర నాయికలు అలియాభట్, కంగనారనౌత్ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై నిరసనగళం వినిపిస్తున్నది కంగనారనౌత్. ఈ క్రమంలో ఆమె ఇటీవలే అలియాభట్‌పై విమర్శలు చేసింది. అలియా నటించిన తాజా చిత్రం ‘గంగూభాయి కథియావాడి’ ఈ నెల 25న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఉద్దేశిస్తూ ఈ మధ్యే కంగనారనౌత్ ‘వచ్చేవారం బాలీవుడ్లో రెండొందలకోట్లు బుగ్గిపాలు కాబోతున్నాయి’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.
ఆమె మాటలు బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వీటిపై తనదైన శైలిలో ప్రతిస్పందించింది అలియాభట్. ‘గంగూభాయి కథియావాడి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కోల్‌కతా మీడియాతో ముచ్చటించరామె. కంగనారనౌత్ వ్యాఖ్యాలపై స్పందించమని అడగ్గా ‘శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే..ఏం పనిలేని వారు ఏదో ఒక పనిచేస్తున్నట్లు కనిపిస్తారు’ అనే అర్థంలో భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించింది. దీంతో ఈ ముద్దుగుమ్మల మాటల యుద్ధం ఎటువైపుకు వెళ్తుందోనని అందరూ చర్చించుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

