చిత్రగుప్తుడిగా..
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్‌దేవ్‌గణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్గాడ్' సిద్ధార్థ మల్హోత్రా, రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలకానుంది. గురువారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. మనుషుల పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడితో ఓ సామాన్యుడి తగువు ఎందుకనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్‌దేవ్‌గణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్గాడ్’ సిద్ధార్థ మల్హోత్రా, రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలకానుంది. గురువారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. మనుషుల పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడితో ఓ సామాన్యుడి తగువు ఎందుకనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్ చిత్రగుప్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో గొడవ పడే సామాన్యుడి పాత్రలో సిద్ధార్థ మల్హోత్రా నటించారు. గురువారం అజయ్‌దేవ్‌గణ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘రెగ్యులర్ కామెడీ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ చిత్రం. చిత్రగుప్తుడితో సామాన్యుడి గొడవ వినోదాన్ని అందిస్తుంది. చక్కటి హాస్యంతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించే చిత్రమిది’ అన్నారు. ఇంద్రకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

