న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్న వైమానికి సిబ్బంది టీకా అనంతరం 48 గంటలపాటు విధులుగా అన్ఫిట్గా పరిగణించబడుతారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. టీకా తీసుకున్న సిబ్బంది ఆ తర్వాత 48 గంటలపాటు ఫ్లైట్లో వెళ్లడానికి అనర్హులని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. 48 గంటల తాత్కాలిక అన్ఫిట్నెస్ అనంతరం ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే సిబ్బంది విధుల్లో చేరవచ్చని సూచించింది.
కొవిడ్ టీకా ఇవ్వగానే సిబ్బందిని 30 నిమిషాలపాటు పరిశీలిస్తారని, ఆ 30 నిమిషాల్లో ఎలాంటి విపరీత లక్షణాలు లేకపోతే 48 గంటల తర్వాత విధులకు హాజరుకావచ్చని పేర్కొన్నది. ఒకవేళ 48 గంటల అనంతరం సిబ్బందిలో ఏవైనా విపరీత లక్షణాలు కనిపిస్తే మాత్రం 14 రోజుల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది