Air Chief Staff | ఐఏఎఫ్ కొత్త చీఫ్‌గా వీఆర్ చౌదరి!
Air Chief Staff | ఐఏఎఫ్ కొత్త చీఫ్‌గా వీఆర్ చౌదరి! | ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా వివేక్ రామ్ చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్న

న్యూఢిల్లీ : ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా వివేక్ రామ్ చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్న రాకేశ్‌కుమార్ సింగ్ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్తగా చీఫ్ ఎంపికపై కేంద్రం దృష్టి పెట్టింది. వీఆర్ చౌదరి ఈ ఏడాది జూలై 1న డెప్యూటీ ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1982, డిసెంబర్ 29న ఐఏఎఫ్‌లో చేరారు.
దాదాపు 38 సంవత్సరాల కెరీర్లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు. మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3,800 గంటలు ప్రయాణించిన అనుభవం ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, వెల్లింగ్టన్ పూర్వ విద్యార్థి. ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పశ్చిమ ఎయిర్ కమాండ్ (WAC) కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పని చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

