స్టాక్‌హోం, ఫిబ్రవరి 19: కారుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండే ఎయిర్‌బ్యాగ్‌లు సంజీవనిలా ప్రయాణికుల ప్రాణాలు కాపాడతాయి. ఇదే విధంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారికి గాయాలు కాకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించింది స్వీడన్‌కు చెందిన మోసైకిల్ సంస్థ. ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే జీన్స్ ప్యాంట్‌ను తయారుచేసింది. ఈ జీన్స్‌కు కార్బన్ డయాక్సైడ్తో కూడిన క్యాడ్రిడ్జ్ ఉంటుంది.
ఈ జీన్స్ ధరించి బైక్ నడిపే వ్యక్తి కింద పడుతుండగానే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటుంది. బైకర్ కాళ్లకు గాయాలు కాకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందని, బైకర్ కిందపడే లోపే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటుందని మొసైకిల్ సంస్థ పేర్కొంది. ఈ జీన్స్ కూడా మిగతా ప్యాంట్లలానే సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది.