Randeep Guleria | కరోనా కేసులు పెరిగినా.. ‘థర్డ్‌వేవ్’కు అవకాశాలు తక్కువే : ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ : రాబోయే నెలల్లో కొవిడ్ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజలు కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు టీకాలు వేసుకుంటున్నారన్నారు. వైరస్ సోకినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదన్నారు. అయితే, ప్రజలు కొవిడ్ నియమాలను ఎంత మేరకు ఖచ్చితంగా పాటిస్తారనే విషయంపైనే కొవిడ్ ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు.
‘థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ప్రభావం’పై ఆయనను ప్రశ్నించగా.. టీకాలు వేయకపోవడంతో చాలా మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అయినా పిల్లలు కరోనా బారినపడినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండదని ప్రపంచ డేటా చూపిస్తోందన్నారు. దేశంలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో 55-60 శాతం మంది పిల్లల్లో ఇప్పటికే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారన్నారు.
అయితే పాఠశాలల పునః ప్రారంభంపై స్పందిస్తూ.. వైరస్ సానుకూలత రేటు తక్కువ ఉన్న ప్రాంతాలు, కొవిడ్ నిబంధనలు అనుసరిస్తున్న ప్రాంతాల్లో తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చన్నారు. కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైతే వెంటనే వాటిని మూసివేయాలన్నారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడంతో ‘రిస్క్-బెనిఫిట్‌అనాలిసిస్’పై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులకు భౌతిక తరగతులు చాలా ముఖ్యమైనవన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

