AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
AIADMK Leader Arrest | తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఏఐఏడీఎంకే నేత రూ.30 కోట్లు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో జరుగనున్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆ టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభానికి గురి చేసినట్లు ఆయన సహాయకుడు ఫిర్యాదు చేశాడు.
చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఏఐఏడీఎంకే నేత రూ.30 కోట్లు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో జరుగనున్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆ టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభానికి గురి చేసినట్లు ఆయన సహాయకుడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఏఐఏడీఎంకే నేతను అరెస్ట్ చేశారు. (AIADMK Leader Arrest) మదురై సెంట్రల్ టీవీకే ఎమ్మెల్యే మధర్ బద్రుద్దీన్ అలియాస్ ముస్తఫాకు, మాజీ డిప్యూటీ మేయర్, ఏఐఏడీఎంకే నేత పీఎం మన్నన్ రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు లంచం ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగనున్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ ఎమ్మెల్యే సహాయకుడు కనీ ద్వారా ఈ ఆఫర్ పంపినట్లు సమాచారం.
కాగా, టీవీకే ఎమ్మెల్యే మధర్ బద్రుద్దీన్ సహాయకుడు కనీ ఫిర్యాదుపై మదురై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దర్యాప్తు చేశారు. నాలుగు గంటలకుపైగా మన్నన్‌ను విచారించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. మన్నన్ అరెస్ట్ నేపథ్యంలో అన్నాడీఎంకే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మదురై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వద్ద గుమిగూడారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఈ ప్రలోభ ఆరోపణలపై అధికారిక ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సహాయకుడు కనీని కూడా పోలీస్ దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపిత టెలిఫోన్ సంభాషణలు, ఆడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఆరోపిత కుట్రకు సంబంధించిన ఇతర కీలక వ్యక్తులను గుర్తించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- arrested
- Government
- leader
RELATED ARTICLES
తాజా వార్తలు
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

