ఆ సీన్.. ఎవర్ గ్రీన్!
‘భీమ్లా నాయక్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మేనన్. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ‘బింబిసార’తో మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. తొలి సినిమాకు ఎదురైన విమర్శలను తిప్పికొట్టి, నటనపై పట్టు సాధించి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సంయుక్త సినిమా ముచ్చట్లు..
‘భీమ్లా నాయక్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మేనన్. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ‘బింబిసార’తో మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. తొలి సినిమాకు ఎదురైన విమర్శలను తిప్పికొట్టి, నటనపై పట్టు సాధించి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సంయుక్త సినిమా ముచ్చట్లు..
సినిమాలో ఎంత నిడివిగల పాత్ర చేశామన్నది ముఖ్యం కాదు. ఎంత ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశామన్నదే ప్రధానమని నమ్ముతాను. ‘భీమ్లా నాయక్’లో పవన్‌కల్యాణ్‌తో ఒకే ఒక్క సీన్లో నటించా. కానీ, ఆ ఒక్క సీనే నన్ను తెలుగు వారికి దగ్గర చేసింది. ప్రేక్షకుల స్పందన చూశాక. మిగతా వాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదు అనిపించింది.
మలయాళంలో వచ్చిన ‘పాప్‌కార్న్’ నా మొదటి సినిమా. అందులో నన్ను చూసి.. ఈ అమ్మాయికి నటించడమే రాదని విమర్శించారు. నిజానికి అప్పుటికి నాకు సినిమాల పట్ల అవగాహనే లేదు. అవకాశం వచ్చిందని అంగీకరించాను. కానీ, ఆ సినిమా తర్వాత పరిశ్రమ అంటే పూర్తి అవగాహన వచ్చింది. నటిగా పేరు తెచ్చుకోవాలనే కసి పెరిగింది. నన్ను నేను చాలా మార్చుకున్నాను.
తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా కథ నచ్చక పోవడంతో ఒప్పుకోలేదు. ‘భీమ్లా నాయక్’కు ముందే ‘బింబిసార’కు సంతకం చేశాను. ధనుష్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ‘సార్’లోనూ నటిస్తున్నా. ఒక్కపాట మినహా షూటింగ్ పూర్తయింది. సాయితేజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఇన్ని ప్రాజెక్టులకు పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. మలయాళంలోనూ నటించబోతున్నా.
మాది కేరళలోని పాలక్కడ్. నా చదువంతా అక్కడే సాగింది. ఎకనమిక్స్ సబ్జెక్టుగా డిగ్రీ చేశాను. సినిమాల్లోకి రాకముందు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశాను. అందులో భాగంగా ఓ సినిమా ఫంక్షన్ కోసం ట్రోఫీలను వరుసలో పెట్టి, అదే స్టేజీ మీద ఓ మూలన నిల బడ్డాను. కానీ ఇప్పుడు నేనే స్టేజీ మీద ఒక అట్రాక్షన్‌గా నిలబడటం అన్నది నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నది.
చిన్నప్పటినుంచీ నటన అంటే ఇష్టం. సినిమా అంటే పిచ్చి. మంచి పీరియాడిక్ పాత్రలు చేయాలని కోరిక. ఆ జానర్లో వచ్చిన ‘బాహుబలి’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాలను చాలాసార్లు చూశాను. ‘బింబిసార’ కథ విన్నప్పుడు అలాంటి పాత్రే దొరికిందని ఆశపడ్డా. కానీ, కుదరలేదు. మోడ్రన్ అమ్మాయిగా చేశాను. మొదటి భాగంలో తక్కువైనా, రెండో భాగంలో మాత్రం నా పాత్ర నిడివి ఎక్కువే.
డైలాగ్‌లో భావం పలికిస్తూ
నటించాలంటే భాష తెలియాలి.అప్పుడే, హావభావాలు బాగా వస్తాయి. కాబట్టే, నేను ఏ భాషలో నటించినా.. నా డబ్బింగ్ నేనే చెప్పుకొనే ప్రయత్నం చేస్తా. పాత్రను పూర్తిగా సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా భాష తెలియాలి. అప్పుడే, నటిగా సంతృప్తి దొరుకుతుంది. అందుకే టాలీవుడ్లో అవకాశం రాగానే.. ప్రత్యేకంగా ఓ శిక్షకుణ్ని పెట్టుకుని మరీ తెలుగుభాష నేర్చుకున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

