Tollywood Drugs Case | ఎల్లుండి ఈడీ విచారణకు హీరో దగ్గుబాటి రానా!
Tollywood Drugs Case | ఎల్లుండి ఈడీ విచారణకు హీరో దగ్గుబాటి రానా! | టాలీవుడ్ డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మికౌర్,

హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మికౌర్, రకుల్ ప్రీత్‌సింగ్‌లను అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్ ఇచ్చిన సమాచారం.. అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీల ఆధారంగా ఈడీ పలువురు తెలుగు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో లేకుండా కేవలం ఈడీ సమన్లు అందుకున్న వారిలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించగా.. బుధవారం నాటి విచారణకు హీరో దగ్గుబాటి రానా హాజరువుతుండడం ఆసక్తికరంగా మారింది. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్‌క్లబ్‌లో పలుసార్లు నిర్వహించిన పార్టీలకు రకుల్, రానా ఇంకా ఇతరులు హాజరైనట్లు ఉన్న పక్కా సమాచారం ప్రకారమే ఈడీ వారికి సైతం సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. రానా బ్యాంకు ఖాతాల వివరాలు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. వీటి ఆధారంగా, అందులోని లావాదేవీలు, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైనా రానాను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

