అభిలాష్ బండారి, హృతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకుడు. వెంకటరత్నం నిర్మాత. టైటిల్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ నేపథ్యంలో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతాం. ప్రేమజంట ప్రయాణంలో చోటుచేసుకునే సంఘటనలు ఆసక్తిని పంచుతాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: సింధు కే ప్రసాద్, నిర్మాణ సంస్థ: చక్ర ఇన్ఫోటైన్మెంట్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: జీవీకే.