Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Pay Commission | ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) కేంద్ర ప్రభుత్వ (Union Govt) ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై చర్చకు తెరతీసింది. సవరించిన వేతన స్కేళ్లు (Pay scales), అలవెన్సుల (Allowances) పై స్పష్టత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. 2025 నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎనిమిదో వేతన కమిషన్‌కు.. వేతన సవరణలకు సంబంధించిన సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు.
Pay Commission : ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) కేంద్ర ప్రభుత్వ (Union Govt) ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై చర్చకు తెరతీసింది. సవరించిన వేతన స్కేళ్లు (Pay scales), అలవెన్సుల (Allowances) పై స్పష్టత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. 2025 నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎనిమిదో వేతన కమిషన్‌కు.. వేతన సవరణలకు సంబంధించిన సిఫార్సులను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు.
ఈ కమిషన్ ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల ఆర్థిక అవసరాలు వంటి అంశాలను పరిశీలించి, ఉద్యోగులు పెన్షనర్ల వేతన సవరణ స్కేలును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంది. విస్తృతంగా జరిగిన సంప్రదింపుల మధ్య ఉద్యోగుల ప్రతినిధి సంఘాలు మెరుగైన వేతనం, ఎక్కువ అలవెన్సులు, అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం డిమాండ్లు లేవనెత్తాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కొత్త వేతన సంఘం కింద సవరించిన మూల వేతనాలను లెక్కించడానికి ఉపయోగించే ఒక సాధనం.
ఉదాహరణకు 2.0 ఫ్యాక్టర్ రూ.18,000 మూల వేతనాన్ని రూ.36,000కు పెంచుతుంది. 8వ వేతన సంఘం ముందు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లపై డిమాండ్లు 3.2 నుంచి 4 వరకు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.
హై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే..
ఒక ఉద్యోగి ప్రస్తుతం రూ.18,000 బేసిక్ పే పొందుతున్నారని అనుకుందాం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 గా తీసుకుందాం. అప్పుడు సవరించిన బేసిక్ పే రూ.18,000 ×3 = రూ.54,000. అంటే బేసిక్ పేలో పెరుగుదల రూ.36,000 అవుతుంది.
అదేవిధంగా బేసిక్ పే రూ.44,500 సందర్భంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 అనుకుంటే సవరించిన బేసిక్ పే రూ.44,500×3 = రూ.1,33,500. అంటే బేసిక్ పేలో పెరుగుదల: రూ.1,33,500 − రూ.44,500 = రూ.89,000 అన్నమాట.
ఈ విషయం తెలియని ఉద్యోగి దృష్టిలో ప్రాథమిక వేతనం అనేది ఒక భాగం మాత్రమే. కానీ ఈ బేసిక్ పేతోపాటు కరువు భత్యం (Dearness Allowance), ఇంటి అద్దె భత్యం (House Rent Allowance), రవాణా భత్యం (Transport Allowance) వంటి ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కేవలం ప్రాథమిక వేతనానికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇది మొత్తం వేతనంలో దాదాపు సగం వాటాను కలిగి ఉంటుంది.
ఇక అధిక బేసిక్ పే కావాలా.. ఎక్కువ అలవెన్సులు కావాలా..? అనే విషయానికి వస్తే.. 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు.. చాలామంది ఉద్యోగులు అధిక అలవెన్సులు కోరుతున్నారు. ఎక్కువ అలవెన్సులు ఉండటంవల్ల ఇంధన ధరల పెరుగుదల, ఇంటి అద్దె వంటి రోజువారీ ఖర్చులను నిర్వహించడం ఉద్యోగులకు సులభతరం అవుతుంది. పాత పన్ను విధానాన్ని అనుసరించే ఉద్యోగులకు ఈ భత్యాలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి సాయపడతాయి.
దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే ఉద్యోగులు అధిక బేసిక్ కే వల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి ప్రధాన కారణం.. పెన్షన్ అనేది బేసిక్ పే తో ముడిపడి ఉండటమే. కాబట్టి అధిక బేసిక్ పే పదవీ విరమణ తర్వాత మెరుగైన ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. పీఎఫ్, ఎన్పీఎస్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా ప్రాథమిక వేతనం ఆధారంగానే లెక్కించబడతాయి. ప్రాథమిక వేతనం ఎక్కువగా ఉంటే ఈ పథకాలలో జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అది దీర్ఘకాలిక భద్రతను చేకూరుస్తుంది.
ఉదాహరణకు
రూ.18,000 బేసిక్ పేపై 12% చొప్పున పీఎఫ్‌కు జమచేస్తూ ఏటా 5% వేతన పెంపును పరిగణనలోకి తీసుకుంటే 30 ఏళ్ల తర్వాత ఒక ఉద్యోగి వద్ద రూ.82.6 లక్షల నిధి సమకూరుతుంది. ఒకవేళ బేసిక్ పే రూ.25,000 అయితే 8.25% (ప్రస్తుత) రాబడి రేటుతో 30 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగి వద్ద రూ.1.21 కోట్ల నిధి సమకూరుతుంది. అంటే అధిక అలవెన్సులు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. అధిక బేసిక్ పే దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది.
కాబట్టి ఉద్యోగులు తమ వేతన నిర్మాణంలోని ఈ అంశాలను, పన్ను ప్రభావాలను, పెన్షన్ నిబంధనలను పోల్చి చూసుకోవడం ద్వారా ఏది తమకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

