కేరళలో బిజెపికి సున్నా ఫలితాలు

తిరువనంతపురం:
కేరళ శాసనసభ ఎన్నికల్లో తన సంఖ్యాబలం పెంచుకోవడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. కేరళ ప్రజలు బీజేపీని పూర్తిగా తిప్పికొట్టారు. ఆదివారం వెలువడిన తాజా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బిజెపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. గత శాసనసభలో ఉన్న నెమోమ్ సీటును కూడా ఈ సారి కోల్పోయి ‘సున్నా’ స్థానాలకు పరిమితమైంది. శాసనసభ ఎన్నికల ముందు తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ బిజెపి అధ్యక్షుడు కే సురేంద్రన్ ప్రకటించారు. అయితే ఫలితాలు దానికి భిన్నంగా వచ్చాయి. స్వయంగా కేరళ బిజెపి అధ్యక్షుడు బరిలోకి దిగిన మంజేశ్వర్ నియోజకవర్గంలోనూ బిజెపి ఓటమి పాలయ్యంది. తొలిరౌండ్లలో నెమోమ్ నుండి పోటీ చేసిన రాజశేఖరన్ కొంత ఆధిక్యత కనపరిచినప్పటికీ కౌంటింగ్ ముగిసే సమయానికి ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానంలో ఎల్డిఎఫ్ అభ్యర్థి వి. శివన్కుట్టి 2025 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొలి రౌండ్లలో బిజెపి శ్రేణుల్లో ఆశలు రేపిన పాలక్కాడ్ నియోజకవర్గ పరిస్థితి కూడా ఇంతే. ఇక్కడ బరిలోకి దిగిన మెట్రో శ్రీధరన్ కాసేపు ఆధిక్యత ప్రదర్శించారు. చివరకు యుడిఎఫ్ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. త్రిసూర్‌లో బిజెపి తరపున బరిలోకి దిగిన ప్రముఖ నటుడు సురేష్‌గోపి కొన్ని గంటల పాటు ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ చివరకు మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇక్కడ ఎల్డిఎఫ్ అభ్యర్థి పి. బాలచంద్రన్ 1,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

