దేశంలో ఎనిమిది ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు…

ఢిల్లీ ,జూన్ 3: దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు కానున్నాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)లను ఏర్పాటు చేయడానికి భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) అమలుచేస్తున్న విధానాలను సరళీకృతం చేయడంతో నూతన ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటుకానున్నాయి. ఈ అకాడమీలు బెలగావి, జల్గావ్, కలబురగి, ఖాజురాహో, లీలబరి లలో ఏర్పాటు కానున్నాయి. విమానాలను నడపడంలో శిక్షణ ఇచ్చే రంగంలో ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి ,శిక్షణ కోసం భారత క్యాడెట్లు విదేశాలకు వెళ్లకుండా చూడడానికి ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు దోహదపడతాయి. పొరుగు దేశాలకు చెందిన క్యాడెట్లకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు.
కోవిడ్-19 సెకండ్ వేవ్ రూపంలో ఎదురైన సమస్యలను అధిగమించి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ల ఏర్పాటుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) పూర్తి చేసి ఐదు విమానాశ్రయాలను ఎంపిక చేసింది. ఈ ఐదు విమానాశ్రయాలలో వాతావరణ, సివిల్, మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ పరంగా అంతరాయాలు తక్కువగా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటుకు వీటిని ఎంపిక చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో భాగంగా విమానాలను నడపడంలో శిక్షణ ఇచ్చే రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది.
ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటుకు భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) 2020 నవంబర్ లో దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిలో ఎంపిక చేసిన ఆసియా-పసిఫిక్, జెట్‌సర్వ్, రెడ్‌బర్డ్, సామ్వర్ధనే , స్కైనెక్స్ లకు అనుమతులు మంజూరు చేస్తూ 2021 మేలో ఉత్తర్వులు వెలువడ్డాయి. విమానయాన భద్రతా అంశాలు, నియంత్రణ వ్యవస్థలు, విమానంలో పైలట్లకు శిక్షణ ఇచ్చే రంగంలో అనుభవం, పరికరాల లభ్యత, శిక్షకులు మొదలైన అంశాల ఆధారంగా ఈ సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. శిక్షణా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వార్షిక అద్దెను 15 లక్షలకు తగ్గించడమే కాకుండా విమానాశ్రయాలకు చెలించవలసి ఉన్న రాయల్టీని పూర్తిగా రద్దు చేయడం జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- academy
- Airports
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

