హోం క్వారంటైన్ తర్వాత పరీక్ష అవసరం లేదు

న్యూఢిల్లీ: పదిరోజుల హోం క్వారంటైన్ తర్వాత కరోనా టెస్టు చేయాల్సిన అవసరం లేదని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఇంటిదగ్గర స్వల్ప లక్షణాలతో లేక లక్షణాలు లేకుండా చికిత్స పొందినవారిలో 6-7 రోజుల తర్వాత వైరస్ నిర్వీర్యం అవుతుందని ఆయన అన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదు. కాకపోతే పరీక్షలు జరిపితే చనిపోయిన వైరస్ అవశేష కణాల వల్ల తప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ గులేరియా చెప్పారు. స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వైరస్ 6-7 రోజుల్లో చనిపోతుందని శాస్త్రీయంగా రుజువైందని ఆయన నొక్కిచెప్పారు. హోం క్వారంటైన్ చికిత్సపై కేంద్ర ప్రభుత్వం కూడా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్ రోగులు పదిరోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని, తర్వాత వరుసగా మూడురోజుల పాటి జ్వరం లేకపోతే క్వారంటైన్ నుంచి బయటకు రావచ్చని వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

