రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్‌లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను

న్యూఢిల్లీ : భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్‌లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని మంత్రిత్వ శాఖను కోరారు. మహిళా అధికారుల తరఫు న్యాయవాది మేజర్ సుధాంశు పాండే మంత్రిత్వశాఖకు నోటీసు పంపారు. శాశ్వత కమిషన్ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరినట్లే పాండే తెలిపారు. 72 మంది మహిళా అధికారుల తరఫున నోటీసు పంపించినట్లు చెప్పారు. రక్షణ కార్యదర్శి, ఢిపెన్స్ స్టాఫ్ చీఫ్‌తో సహా అధికారులకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 25న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా శాశ్వత కమిషన్ అమలు కోరుతున్నామన్నారు. గతంలో సుప్రీం కోర్టు మహిళా అధికారులను బ్యాచ్‌లోని పురుష అధికారులకు నిర్ధేశించిన బెంచ్ మార్కులతో పోల్చరాదని రక్షణ మంత్రిత్వశాఖ, అధికారులకు స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో 60 శాతం మార్కులు సాధించి.. 5 మార్కులతో అనర్హులుగా తేలిన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ అమలు చేయాలని సెలక్షన్ బోర్డుకు కోర్టు సూచించింది. ఉత్తర్వులు అమలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు రెండు నెలల పాటు ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

