రుణాలు జోరు..డిపాజిట్లు డీలా
బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. రుణ వితరణకు తగినట్టు డిపాజిట్లు వృద్ధిచెందడం లేదు.
- రెండింటి మధ్య 7 శాతం గ్యాప్
- ఆర్బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ, జనవరి 26: బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. రుణ వితరణకు తగినట్టు డిపాజిట్లు వృద్ధిచెందడం లేదు. జనవరి తొలి పక్షం రోజుల్లో ఈ రెండింటి మధ్య గ్యాప్ 7.09 శాతానికి చేరిపోయింది. 2024 జనవరి 12నాటికి బ్యాంక్‌లు ఇచ్చే రుణాలు 19.93 శాతం పెరగ్గా, డిపాజిట్లు 12.84 శాతమే అధికంగా వచ్చినట్టు రిజర్వ్‌బ్యాంక్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇదే 2023 సెప్టెంబర్ చివరి పక్షం రోజుల్లో రుణ వృద్ధి (19.42 శాతం), డిపాజిట్ వృద్ధి (12.94 శాతం) మధ్య గ్యాప్ 6.48 శాతంగా ఉన్నది. డిమాండ్ కారణంగా డిపాజిట్ల వృద్ధిని మించి రుణాలు పెరుగుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. స్వల్పకాలికంగా ఈ రెండింటి వృద్ధి మధ్య అంతరం ఏర్పడినా, దీర్ఘకాలంలో గ్యాప్ తొలగిపోతుందని తమ విశ్లేషణలో వెల్లడైనట్టు ఆర్బీఐ వివరించింది. ఇతర మదుపు సాధనాలైన డిబెంచర్లు, షేర్లు ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లకంటే అధిక రాబడులు ఇస్తున్నందున, రుణ వృద్ధితో పోలిస్తే డిపాజిట్ల వృద్ధి వెనుకపడిందని మార్కెట్ నిపుణులు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

