5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. పోటీలో 4 బడా కంపెనీలు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్‌ల రేడియోతరంగాలను వేలం వేస్తున్నారు. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునిల్ మిట్టల్‌కు చెందిన భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలుకు పోటీపడుతున్నాయి. 4జీ కన్నా పది రేట్ల వేగంతో 5జీ స్పెక్ట్రమ్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), 3300 MHz, 26 GHz, ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో వేలం జరగనున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం ఆరు గంటల వరకు సాగనున్నది. స్పెక్ట్రమ్ సిగ్నల్ పూర్తిగా అమ్ముడుపోయే వరకు వేలం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల పాటు వేలం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా సుమారు 70 నుంచి లక్ష కోట్ల వరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు టెలికాం శాఖ తెలిపింది. వేలం కోసం జియో కంపెనీ ముందుగానే 14 వేల కోట్లు డిపాజిట్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

