Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Jobs | బ్యాంక్‌లో అప్రెంటిస్ చేయాలనుకునేవారికి యూకో బ్యాంక్ అవకాశం కల్పించింది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
2026 రిక్రూట్మెంట్లో భాగంగా యూకో (UCO) బ్యాంక్ 1961 అప్రెంటిస్ చట్టం (Act) ప్రకారం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో 530 పోస్టులను నింపనుంది. వీటిలో తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 8 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
తెలంగాణ- 8 (SC-1, OBC-2, UR-5)
ఆంధ్రప్రదేశ్- 8 (SC-1, OBC-2, UR-5)
పశ్చిమ బెంగాల్- 86
ఉత్తరప్రదేశ్- 45
ఒడిశా- 41
రాజస్థాన్- 37
బిహార్- 34
మహారాష్ట్ర- 32
మధ్యప్రదేశ్- 27
హిమాచల్‌ప్రదేశ్- 25
అస్సాం- 24
పంజాబ్- 24
తమిళనాడు- 21
గుజరాత్- 20
పై వాటితో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 530 అప్రెంటిస్‌ల నియామకాలు చేపట్టనున్నారు.
అర్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు. డిగ్రీ సర్టిఫికెట్ 2022, ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత జారీ చేసినది కావాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

Posts Uco
వయసు
అభ్యర్థుల వయసు 2026, అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, జనరల్ దివ్యాంగులకు 10, ఓబీసీ దివ్యాంగులకు 13, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది. వితంతు, విడాకులు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ మహిళకు 40, వితంతు, విడాకులు తీసుకున్న జనరల్, ఈడబ్ల్యూఎస్ మహిళకు 38 ఏండ్ల వరకు అవకాశం కల్పించారు.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 800, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 600, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200. దరఖాస్తు ఒక రాష్ట్రానికి మాత్రమే చేసుకోవాలి.
అర్హత గల అభ్యర్థులు మొదట నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ https://nats.education.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత యూకో బ్యాంక్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక
ఆన్లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రాతపరీక్షను BFSI SSC నిర్వహిస్తుంది. పరీక్ష 100 మార్కులకు (జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్- 25, ఇంగ్లిష్/హిందీ భాష- 25, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్- 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25) ఉంటుంది. సమయం 60 నిమిషాలు.
స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 16,650 స్టైపెండ్ ఇస్తారు. సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 29తో ముగుస్తుంది. దరఖాస్తు ఇతర వివరాలకు వెబ్సైట్ www.uco.bank.in చూడండి.

Apply
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

