ఇసుక దిబ్బల కింద 3 వేల ఏళ్లనాటి ఈజిప్టు నగరం

కైరో: ఈజిప్టు అంటే ప్రాచీన నాగరికత. ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశ ప్రత్యేకత. అయితే తాజాగా ఓ నగరమే బయటపడింది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతంలో ఈ నగరం ఉన్నట్టు ఈజిప్టు పురావస్తుశాఖ తెలిపింది. లక్షర్ సమీపంలో వెలుగు చూసిన ఈ నగరాన్ని ప్రస్తుతానికి రైజ్ ఆఫ్ ఆతెన్ గా పిలుస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచో ఈ నగరం కోసం అన్వేషణ సాగుతోంది. కాలగర్భంలో కలిసిపోయిన ఈ నగరం మూడవ అమెన్హోతెప్ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.
టుటాన్ఖామెన్ సమాధి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పురావస్తు విశేషంగా దీని గురించి చెప్పుకుంటున్నారు. కరోనా కల్లోలానంతర కాలంలో టూరిజం రంగం మరోసారి పుంజుకోవాలని ఆశిస్తున్న ఈజిప్టుకు ఈ నగరం ఓ వరప్రసాదంలా మారుతుందని అంటున్నారు.
ఈజిప్టు సామ్రాజ్యం సంపదతో తులతూగుతున్న కాలానికి చెందిన ఈ నగరం ఆనాటి ప్రజల జీవనశైలిని పట్టిస్తుందని ఆశిస్తున్నారు. 22 రాజకుటుంబాలకు మమ్మీలను కొత్త మ్యూజియంలోకి మార్చిన నేపథ్యంలో ఈ నగరం వెలుగు చూడడం శుభపరిణామం అని ఈజిప్టు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ ఈజిప్షియన్ పురావస్తు శాస్త్రవేత్త జాహీ హవస్ నేతృత్వంలో 2020 సెప్టెంబర్ లో ఈ నగరం కోసం తవ్వకాలు మొదలయ్యాయి. గోడలు, వంటశాలలు, సమాధులు, పనిముట్లు ఉంగరాలు, రంగులు వేసిన కుండలు ఇలా ఎన్నో వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా దొరికాయి. ఇటుకలపై చక్రవర్తి మూడవ అమెన్హోతెప్ రాజముద్రలు ఉన్నాయి. వాటిని బట్టే 3 వేల ఏళ్ల పైచిలుకు నాటి నగరమని కాలనిర్ణయం చేశారు. చక్రవర్తి సింహాసన వారసుడు అఖేనాతెన్, అతని తల్లి నెపర్తీతీ రాజధానిని ఇక్కడ నుంచి అమర్నాకు మార్చడం వెనుక గలకారణాలు ఈ తవ్వకాల ద్వారా తెలుస్తాయని అంటున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

