38 స్టెరిలైట్ కేసులు ఎత్తివేసిన తమిళ ప్రభుత్వం

చెన్నై: కాలుష్యాన్ని వెదజల్లుతున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ మూసివేతను డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనకు సంబంధించి దాఖలు చేసిన 38 కేసులను ఎత్తివేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆ నివేదికలో పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూచించారా లేదా అనేది తెలియరాలేదు. 2018లో తూత్తుకుడి లోని స్టెరిలైట్ యూనిట్‌కు వ్యతిరేకంగా ఉధృతమైన ఆందోళన సాగింది. వేదాంత రిసోర్సెస్ యాజమాన్యంలోని స్టెరిలైట్ తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తున్నట్టు తేలింది. దాంతో కాలుష్యానికి కారణమైన స్మెల్టర్‌ను మూసివేయాలని ఆందోళకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం పొందేవారిలో వైగో, నల్లకణ్ణు, టీటీవీ దినకరన్, ప్రేమలతా విజయకాంత్ తదితరులు ఉన్నారు. దీంతో మొత్తం 93 మంది కేసుల నుంచి విముక్తి పొందారు. భారతదేశంలో దశాబ్దకాలంలో కనివిని ఎరుగని స్థాయిలో సాగిన స్టెరిలైట్ పోరాటం సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది అమరులయ్యారు. పోలీసుల జులుంను, బలప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ కూడా తీవ్రంగా దుయ్యబట్టింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆక్సిజన్ తయారీకి స్టెరిలైట్ యూనిట్‌ను తిరిగి ఉపయోగంలోకి తెచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా యూనిట్ పని ప్రారంభించింది. నాలుగు మాసాల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే కొనసాగుతుందని, రాగి తయారీ, ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

