రాష్ట్రంలో 33 బీసీ స్టడీ సర్కిల్స్, 15 బీసీ డిగ్రీ కళాశాలలు మంజూరు : మంత్రి గంగుల
కరీంనగర్ : రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో బీసీల విద్యపై ప్రధానంగా దృష్టి సారించారని అన్నారు.
గురువారం కరీంనగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాల్లో కేవలం 7,500 మంది మాత్రమే చదువుకునే వారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో 261 బీసీ గురుకులాలు ఏర్పడ్డాయని, ఇందులో ప్రస్తుతం 1,52,440 మంది బీసీ బిడ్డలు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏండ్లలో కేవలం 19 బీసీ గురుకులాలు ఏర్పడగా తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలోనే 261 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. కొత్తగా మరో 33 బీసీ గురుకులాలను, 15 బీసీ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని, దీంతో 294 గురుకులాలు, 16 డిగ్రీ కళాశాలలు పనిచేస్తాయన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి గురుకులంలో 240 సీట్లు, డిగ్రీ కళాశాలలో 1200 సీట్లు ఉంటాయన్నారు. గురుకులాల్లో 5,6,7వ తరగతుల నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న 8 కోర్సులను డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పెడతామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
గురుకులాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
గురుకుల హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎస్సీ కార్పోషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ వై సునిల్ రావు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

