Crime News | లండన్లో భారత సంతతి యువకుడి దారుణ హత్య..!
Crime News | లండన్ (Landon) లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ (West Landon) లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్ (Punjab) కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ (Gurbaz Singh) ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు శనివారం అధికారికంగా వెల్లడించారు.
Crime News : లండన్ (London) లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ (West London) లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్ (Punjab) కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ (Gurbaz Singh) ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు శనివారం అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటనతో లండన్లోని భారత సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటలకు నార్త్ రోడ్లోని డోర్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగింది. కత్తిపోట్లపై సమాచారం అందుకున్న లండన్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడి ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన గుర్భేజ్ సింగ్ను రక్షించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన 30 ఏళ్ల మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అనంతరం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలోనే 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు వ్యక్తులను అనుమానంపై అరెస్ట్ చేశారు.
లోతైన విచారణ అనంతరం ఆరుగురిని ఎలాంటి తదుపరి చర్యలు లేకుండా విడుదల చేయగా.. ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేశారు. మెట్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ అలిసన్ ఫాక్స్వెల్ మాట్లాడుతూ.. ‘గుర్భేజ్ సింగ్ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఉన్నవారు లేదా ఘటనను చూసినవారు ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
ఈ విషాద ఘటన నేపథ్యంలో గుర్భేజ్ సింగ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంత్యక్రియల ఖర్చుల కోసం అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘గోఫండ్మీ’ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. 16,000 యూరోల లక్ష్యంతో ప్రారంభించిన ఈ క్యాంపెయిన్లో ఇప్పటివరకు 737 మంది దాతల నుంచి 11,114 యూరోలు సమకూరాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

