Nipah virus| ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా లక్షణాలు : కేరళ ఆరోగ్యశాఖ మంత్రి
Nipah virus| ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా లక్షణాలు : కేరళ ఆరోగ్యశాఖ మంత్రి | కరోనాతో అల్లాడుతున్న కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ఆదివారం తెలిపారు.

తిరువనంతపురం : కరోనాతో అల్లాడుతున్న కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ఆదివారం తెలిపారు. మరణించిన 12 ఏళ్ల బాలుడికి దగ్గరగా ఉన్న 20 మంది హైరిస్ట్ కాంటాక్టుల్లో ఇద్దరూ ఉన్నారని పేర్కొన్నారు. ‘మేమం ఇప్పటి వరకు 188 కాంటాక్ట్‌లను గుర్తించాం. నిఘా బృందం వారిలో 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించింది. ఇద్దరిలో లక్షణాలున్నాయి. వీరిద్దరూ ఆరోగ్య కార్యకర్తలు. ఒకరు ప్రైవేటు హాస్పిటల్లో పని చేస్తున్నారు.
మరొకరు కోజికోడ్ మెడికల్ కాలేజీ స్టాఫ్ మెంబర్’ అని వివరించారు. నిఫా వైరస్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం వరకు 20 హై రిస్క్ కాంటాక్టులను కోజికోడ్ మెడికల్ కాలేజీకి బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు, ఇతర కాంటాక్టులు క్వారంటైన్లో ఉండాలని కోరినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పే వార్డు పూర్తిగా నిఫా వార్డుగా మార్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ 12 సంవత్సరాల బాలుడు ఆసుప్రతిలో మృతి చెందగా.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి బాలుడి నమూనాలను పంపగా.. నిఫా వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

